Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

Follow Udayam on Google
SHRUTHI Sep 04, 2026 6:19 AM సూర్యాపేటGeneral
ఏసీబీ వలలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ - Udayam
సూర్యాపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న వి.సోమయ్య అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులకు చిక్కారు. ఆయన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించగా భారీగా ఆస్తులు బయటపడ్డాయి. వివిధ ప్రాంతాల్లో ఇళ్లు, భూములు, ఓపెన్ ప్లాట్లతో పాటు నగదు, బంగారం, వాహనాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా ఈ ఆస్తుల విలువ రూ.3.54 కోట్లు ఉంటుందని అంచనా వేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...