వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లి జలాశయంలోకి భారీగా వరదనీరు చేరడంతో అధికారులు చేపల వేటను నిషేధించినట్లు ప్రాజెక్టు ఏఈ కిశోర్ కుమార్ తెలిపారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జలాశయంలో 104.34 మీటర్ల నీటిమట్టం నమోదైంది.
ప్రాజెక్టులోకి 7,292 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, అదనపు వరదనీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా హెచ్చరికలు జారీచేశామన్నారు.
Comments
Loading comments...

