Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తోషంలో రేషన్‌ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 19, 2026 5:38 PM ఆదిలాబాద్General
తోషంలో రేషన్‌ కార్డుల పంపిణీ - Udayam
గుడిహత్నూర్‌ మండలంలోని తోషం గ్రామంలో బుధవారం కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు తొడసం దౌలత్‌రావు అర్హులైన లబ్ధిదారులకు 50 రేషన్‌ కార్డులు అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్థులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...