Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు CJPతో కేంద్ర మంత్రుల చర్చలు

శిరీష గౌడ్ Jul 24, 2026 10:14 AM అల్ ఇండియా about 1 hour ago
నేడు CJPతో కేంద్ర మంత్రుల చర్చలు - Udayam Digital
CJP ప్రతినిధులతో కేంద్ర మంత్రుల ఉన్నత స్థాయి సమావేశం ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో జరగనుంది. తటస్థ వేదికపై జరిగే ఈ చర్చల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సహా తమ ప్రధాన డిమాండ్లను ప్రస్తావిస్తామని CJP ప్రకటించింది. మరోవైపు, తమ డిమాండ్ల సాధన కోసం నేడు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలకు CJP పిలుపునిచ్చింది. ఈ భేటీ ఫలితంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...