Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు కొనుగోళ్లపై మంత్రి హెచ్చరిక

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 04, 2026 7:08 AM అమరావతిGeneral
పొగాకు కొనుగోళ్లపై మంత్రి హెచ్చరిక - Udayam
పొగాకు కొనుగోళ్లలో కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. వేలం ప్లాట్‌ఫాంలన్నీ వెంటనే ప్రారంభించి, ప్రతి కంపెనీ తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. పొగాకు రిజెక్షన్ రేటును తగ్గించాలని, అన్ని గ్రేడ్‌ల పొగాకును కంపెనీలు కొనేలా పొగాకు బోర్డు కఠినంగా పర్యవేక్షించాలని సూచించారు. రైతులను నష్టపరిచే అక్రమాలను ఎంతమాత్రం సహించబోమని అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...