వార్తలకు తిరిగి వెళ్లండి
ఏపీ పోర్టుల అభివృద్ధిపై కేంద్రానికి వినతి

ఆంధ్రప్రదేశ్‌లో మారిటైమ్ ఎకోసిస్టమ్, పోర్టు ఆధారిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ను రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు దిల్లీలో ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్ పోర్టులు, షిప్ బిల్డింగ్ క్లస్టర్లు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని వేగంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు.
Comments
Loading comments...