Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతుల రాస్తారోకో

Follow Udayam on Google
హరిక శర్మ Jul 06, 2026 12:56 PM మార్కాపురంGeneral
గిట్టుబాటు ధర కోసం పొగాకు రైతుల రాస్తారోకో - Udayam
పొదిలి వేలం కేంద్రంలో పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రైతులు సోమవారం ఒంగోలు-కర్నూలు రహదారిపై రాస్తారోకో చేశారు. కేంద్రానికి తీసుకొచ్చిన సుమారు 400 బేళ్లలో ఎక్కువ శాతం 'నోబిడ్' కావడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలోకు రూ.200 తగ్గకుండా ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా వ్యాపారులు ధరలు కల్పించడం లేదని ఆవేదన చెందారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులతో పొదిలి సీఐ రాజేష్ కుమార్, ఎస్సై రాజేష్ మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

Comments

G
Loading comments...