Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై చెత్త వేస్తే భారీ జరిమానా

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 06, 2026 12:53 PM మార్కాపురంGeneral
రోడ్డుపై చెత్త వేస్తే భారీ జరిమానా - Udayam
పొదిలి పట్టణంలోని వ్యాపారస్థులు తమ దుకాణాల చెత్తను డస్ట్‌బిన్లలో వేయకుండా రోడ్లపై పడేస్తే రూ.1000 జరిమానా విధిస్తామని శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతీ రావు హెచ్చరించారు. సోమవారం పాతూరులోని దుకాణదారులతో ఆయన మాట్లాడారు. పట్టణాన్ని స్వచ్ఛ నగర పంచాయతీగా మార్చేందుకు ప్రజలు, వ్యాపారులు మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...