Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీఎస్టీ, ఎక్సైజ్‌ సుంకాల పెంపుపై పొగాకు రైతుల నిరసన

Follow Udayam on Google
సాయి తేజ Aug 10, 2026 6:44 PM ప్రకాశం General
జీఎస్టీ, ఎక్సైజ్‌ సుంకాల పెంపుపై పొగాకు రైతుల నిరసన - Udayam
ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రం ఎదుట జీఎస్టీ, ఎక్సైజ్‌ సుంకాల పెంపును వ్యతిరేకిస్తూ రైతులు సోమవారం నిరసన చేపట్టారు. సుంకాలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ పొగాకు బేళ్లను రోడ్డుపై దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రైతులు అధికారులతో మాట్లాడి గిట్టుబాటు కల్పించాలని కోరారు. లేకుంటే వేలం అడ్డుకుంటామని తెలిపారు. అధికారులు రైతులు, బయ్యర్లతో చర్చించడంతో వేలం కొనసాగింది.

Comments

G
Loading comments...