Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తంగేడులో కూలిన తలుపులమ్మ తల్లి చెట్టు

Follow Udayam on Google
Anuroop Oct 29, 2026 11:11 AM అనకాపల్లి General
తంగేడులో కూలిన తలుపులమ్మ తల్లి చెట్టు - Udayam
కోటవురట్ల మండలం తంగేడులో భారీ వర్షాలకు గ్రామ దేవత తలుపులమ్మ తల్లిగా భావించే వేపచెట్టు రాత్రి కూలిపోయింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు ఈ చెట్టును అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తూ ఏటా మే నెలలో జాతర నిర్వహిస్తారు. గ్రామం నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెట్టుకు మొక్కితే పనులు విజయవంతమవుతాయని వారి నమ్మకం.

Comments

G
Loading comments...