Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తలుపులమ్మ ఆలయంలో 11 నుంచి నవరాత్రులు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:58 PM కాకినాడGeneral
తలుపులమ్మ ఆలయంలో 11 నుంచి నవరాత్రులు - Udayam
తుని మండలంలోని శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 11 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, దర్శనాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఉచిత కుంకుమార్చన సామగ్రి, మంచినీరు, ప్రసాదాలు, క్యూ లైన్ల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో విశ్వనాథరాజు తెలిపారు. 11న దీక్ష మాలధారణ, 19న దీక్ష విరమణ ఉంటాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...