వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలోని కరస్‌గుత్తి గ్రామ అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు విద్యావతి, శ్రీదేవి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించారు.
పుట్టిన తర్వాత తొలి ఆరు నెలలు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అవే సంపూర్ణ పోషకాహారం, రోగనిరోధక శక్తిని అందిస్తాయని తెలిపారు. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలు ఎంతో అవసరమని సూచించారు.
Comments
Loading comments...

