Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలి: అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ

Follow Udayam on Google
sudheer Aug 03, 2026 8:37 PM కరీంనగర్General
తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచాలి: అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ - Udayam
కరీంనగర్ జిల్లాలో తల్లిపాల ప్రాముఖ్యతపై గ్రామీణ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. ఈనెల 7 వరకు జరిగే 'తల్లిపాల వారోత్సవాల' పోస్టర్‌ను అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, ఆరు నెలల వరకు తల్లిపాలే అందించాలని స్పష్టం చేశారు. ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...