వార్తలకు తిరిగి వెళ్లండి
తిరుపతిలో జులై 2న ట్రాఫిక్ ఆంక్షలు: ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో జులై 2న ఉదయం 7 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తిరుపతిలో ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. వాహనదారులు సహకరించాలని కోరారు.
తిరుపతి-కడప మధ్య రాకపోకలు సాగించే వాహనాలు రాజంపేట, బెస్తపల్లి, చిట్వేలి మీదుగా వెళ్లాలని సూచించారు. అత్యవసర వాహనాలకు మినహాయింపు ఉంటుందని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ముందే చూసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...