వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ప్రజా ఫిర్యాదుల వేదికలో 17 అర్జీలను స్వీకరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, స్వీకరించిన ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘుతో పాటు పలువురు నగరపాలక శాఖ అధికారులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

