Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దోమల నివారణకు కర్నూలు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 29, 2026 5:09 PM కర్నూలుGeneral
దోమల నివారణకు కర్నూలు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు - Udayam
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సీజనల్ వ్యాధుల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టారు. నగరంలో దోమల నియంత్రణకు 39 మంది సిబ్బంది, 10 యంత్రాలతో ఫాగింగ్, స్ప్రేయింగ్ పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పది రోజులకు ఒకసారి అబేట్ పిచికారీ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నగరంలో పారిశుధ్య పనులను స్వయంగా పర్యవేక్షించిన కమిషనర్, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...