Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు

Follow Udayam on Google
రమేష్ బాబు Jun 29, 2026 5:04 PM అమరావతిGeneral
రేపు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు - Udayam
ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Comments

G
Loading comments...