వార్తలకు తిరిగి వెళ్లండి
విశాఖలో రాష్ట్రపతి ముర్ము పర్యటన

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రి నారా లోకేశ్ పాల్గొంటారు.
రాష్ట్రపతి రాక సందర్భంగా విశాఖలో అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...