Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలగిరిలో ఐలమ్మకు నివాళులు

Follow Udayam on Google
Kiran Sep 10, 2026 12:53 PM సూర్యాపేటGeneral
తిరుమలగిరిలో ఐలమ్మకు నివాళులు - Udayam
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా తిరుమలగిరిలో గురువారం వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం దొరల అహంకారాన్ని ఆమె ఎదురించారని మున్సిపల్‌ ఛైర్మన్‌ సంకేపల్లి రఘునందన్‌రెడ్డి అన్నారు. ఐలమ్మను వీరవనితగా కొనియాడారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...