వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. స్వచ్ఛత ప్రమాణాలు పెంచేందుకు ఆధునిక యంత్రాలను వినియోగించనున్నట్లు చెప్పారు.
పారిశుద్ధ్య ఫిర్యాదులను రియల్‌టైమ్‌లో నమోదు చేసి, పరిష్కారాన్ని పర్యవేక్షించేందుకు ‘నందకం’ యాప్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. వచ్చే నెలలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశముందని వెల్లడించారు.
Comments
Loading comments...

