వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని ఆదివారం రికార్డు స్థాయిలో 91,793 మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.90 కోట్లుగా నమోదైంది. సుమారు 31,221 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా, 4.38 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.
ప్రస్తుతం భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లలో వేచి ఉండగా, సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ జరుగుతోంది.
Comments
Loading comments...

