వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో తగ్గిన నేరాల రేటు: హోంమంత్రి అనిత

రాష్ట్రంలో నేరాల రేటు 14 శాతం తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి సాగును సున్నాకు చేర్చడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె తెలిపారు.
రాష్ట్రం డ్రగ్స్ రహితంగా మారాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక 'ఈగల్' టాస్క్‌ఫోర్స్ 1.20 లక్షల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసిందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ దిశగా ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...