వార్తలకు తిరిగి వెళ్లండి
మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం భరోసా

మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులను స్మార్ట్ కిచెన్ల పేరుతో తొలగిస్తున్నారనే ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఏ ఒక్క కార్మికుడిని ఉద్యోగం నుంచి తొలగించడం లేదని, వారిని గౌరవిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
అలాగే, ఏప్రిల్ వరకు జీతాలను ఇప్పటికే చెల్లించామని, సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన వేతనాలను కూడా త్వరలోనే అందజేస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా కుట్ర జరుగుతోందని ఏపీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఆరోపించింది.
Comments
Loading comments...