Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jun 29, 2026 4:23 PM కర్నూలుGeneral
కల్లూరులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ - Udayam
పాణ్యం నియోజకవర్గానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులకు రూ. 17,98,047 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సోమవారం కల్లూరులో పంపిణీ చేశారు. వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ. 8 లక్షలు, కే. భూపాల్ ఆచారికి రూ. 6,36,340, సులోచనమ్మ కుటుంబానికి రూ. 3,61,707 చొప్పున ఆమె అందజేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ఈ నిధులు అండగా నిలుస్తాయని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...