వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీశైలంలో నేడు గిరిప్రదక్షిణ

పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం శ్రీశైలంలో గిరిప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, మహామంగళహారతుల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది.
భక్తులు క్షేత్రంలోని ప్రాచీన మఠాలు, ఆలయాలను దర్శించుకునేలా ఈ గిరిప్రదక్షిణను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పునీతులు కావాలని కోరారు.
Comments
Loading comments...