Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి

Follow Udayam on Google
రాజిత దేవి Aug 10, 2026 10:30 AM కామరెడ్డిGeneral
తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి - Udayam
సదాశివనగర్‌ మండలం తిర్మాన్‌పల్లి శివారులోని ఇటుక బట్టీ వద్ద కోడిపందేలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 11 ఫోన్లు, రూ.45,050 నగదు, 65 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను గమనించిన కొందరు పరారైనట్లు తెలిపారు.

Comments

G
Loading comments...