Udayam Digital
Menu

తీరం దాటిన అక్వాన్ తుఫాన్

Sai Nath Nov 20, 2026 10:46 AM జాతీయంGeneral
తీరం దాటిన అక్వాన్ తుఫాన్ - Udayam Digital
అక్వాన్ తుఫాన్ ఉదయం 7.30 నుంచి 8.30 గంటల మధ్య ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటినట్లు APSDMA వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 70-90 కి.మీ. వేగంతో గాలులు వీచాయని తెలిపింది. తుఫాన్ పూర్తిగా తీరం దాటేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...