వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో పెద్దపులి సంచారం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బుద్దికొండ-వడూర్ మధ్య గల ప్రధాన రహదారిని ఈ పులి దాటుతుండగా శనివారం అర్ధరాత్రి కొందరు గమనించారు.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న వడూర్ గ్రామానికి చెందిన యువకులు తమ సెల్‌ఫోన్లలో పులికి సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించారు. ఈ సమాచారంతో అటవీ ప్రాంత పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Loading comments...

