Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం లో లారీ-ఆటో ఢీకొని ముగ్గురు మహిళలు మృతి

శివ కుమార్ Jun 28, 2026 6:36 AM శ్రీకాకుళం 5 viewsabout 1 hour ago
శ్రీకాకుళం లో లారీ-ఆటో ఢీకొని ముగ్గురు మహిళలు మృతి - Udayam Digital
శ్రీకాకుళం జిల్లా జమేదారిపుట్టుగ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రాలీ ఆటోను పలాస వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను పార్వతి, పద్మమ్మ, తరినమ్మలుగా గుర్తించారు. కవిటి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...