Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దశాబ్దం తర్వాత లాభాల బాటలో టీజీఎస్‌ఆర్టీసీ

అశ్విని దేవి Jun 28, 2026 6:39 AM హైదరాబాద్ 6 viewsabout 1 hour ago
దశాబ్దం తర్వాత లాభాల బాటలో టీజీఎస్‌ఆర్టీసీ - Udayam Digital
ఏటా వేల కోట్ల నష్టాలతో సతమతమైన టీజీఎస్‌ఆర్టీసీ, పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత లాభాల బాట పట్టింది. 'మహాలక్ష్మి' పథకం, ప్రయాణికుల రద్దీ పెరగడం, ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారంతో 2025-26లో సంస్థ చరిత్రలోనే రికార్డు స్థాయిలో రూ.1,059.27 కోట్ల లాభాలను ఆర్జించింది. ఆదాయం పెరగడం, నిర్వహణ ఖర్చులు తగ్గడంతో సంస్థ ఆర్థికంగా పుంజుకుంది. ఇదే ఉత్సాహంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో రూ.1,118 కోట్ల మిగులు సాధించడమే లక్ష్యంగా ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Comments

G
Loading comments...