వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగుడలో ఒడిశా నుంచి 14 కిలోల గంజాయిని తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. కిల్లోగుడ కూడలిలో వాహన తనిఖీల్లో స్కూటీపై గంజాయి తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
నిందితుల్లో ఇద్దరిని కేంద్ర కారాగారానికి, బాలుడిని బాలనేరస్థుల గృహానికి తరలించారు. ప్రధాన నిందితుడిపై గతంలోనూ విశాఖ వన్‌టౌన్‌లో గంజాయి కేసులు ఉన్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Loading comments...

