వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరుద్యోగులకు TGPSC తీపి కబురు అందించింది. రేపు మూడు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఛైర్మన్ వెంకటేశం ప్రకటించారు. ఈ నెలలో మొత్తం ఐదారు నోటిఫికేషన్లు వస్తాయని, ఇకపై ప్రతి నెలా మూడు నోటిఫికేషన్లు ఇస్తామని తెలిపారు.
ఆర్థిక శాఖ అనుమతించిన 3,800 పోస్టులలో 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ పరీక్షలన్నీ సీబీటీ (CBT) విధానంలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

