వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలి డివిజన్ పరిధిలో ఆదివారం వేకువజామున పలుచోట్ల వర్షం కురిసింది. మొత్తంగా 85.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కాగా, సగటున 10.7 మి.మీగా నమోదైంది.
అత్యధికంగా తెనాలిలో 20.4 మి.మీ వర్షం పడింది. దుగ్గిరాలలో 17.6, చేబ్రోలులో 16.4, కాకుమానులో 13.4, పొన్నూరులో 8.6, కొల్లిపరలో 7.6, మంగళగిరిలో 1.8 మి.మీ చొప్పున వాన కురిసింది. తాడేపల్లిలో మాత్రం వర్షం నమోదు కాలేదు.
Comments
Loading comments...

