వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షంతో ఎండుతున్న పంటలకు ఉపశమనం లభించిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పంటలకు వర్షం ప్రాణం పోసిందని పేర్కొన్నారు. వర్షం మరికొంత కొనసాగితే సాగుకు మరింత ప్రయోజనం చేకూరుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

