వార్తలకు తిరిగి వెళ్లండి

ఉగ్రవాదం, సైబర్ నేరాలు మరియు ఆర్థిక మోసాలకు టెలిగ్రామ్ అడ్డాగా మారుతోందని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ యాప్‌లోని ప్రైవసీ ఫీచర్లు నేరగాళ్లకు అనుకూలంగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది.
2025లో టెలిగ్రామ్ ద్వారా రూ.3,086 కోట్ల మోసాలు జరిగాయని వెల్లడించింది. మొత్తం యాప్‌ను నిషేధించడం కాకుండా, అసాంఘిక కంటెంట్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్లాట్‌ఫామ్‌పై నిఘా పెంచుతున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Loading comments...

