Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూత్ టూరిజం క్లబ్‌ల నమోదులో తెలంగాణ అగ్రస్థానం

భరత్ తేజ Jun 24, 2026 6:22 AM హైదరాబాద్ 10 viewsabout 18 hours ago
యూత్ టూరిజం క్లబ్‌ల నమోదులో తెలంగాణ అగ్రస్థానం - Udayam Digital
దేశంలోనే అత్యధికంగా యూత్ టూరిజం క్లబ్‌లను ఏర్పాటు చేయడంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా నమోదైన 9 వేల క్లబ్‌లలో దాదాపు 5 వేల క్లబ్‌లు మన రాష్ట్రంలోనే ఉండటం విశేషం. విద్యార్థులలో వారసత్వ సంపద, పర్యాటకం పట్ల అవగాహన కల్పించేందుకు 'తెలంగాణ దర్శిని' కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు కోసం విద్యాశాఖ, పర్యాటక శాఖ అధికారులతో బేగంపేటలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...