వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ లాజిస్టిక్స్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించి ‘హై పెర్ఫార్మర్’గా నిలిచింది. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చేపట్టిన మౌలిక వసతుల అభివృద్ధి, పారిశ్రామిక ప్రోత్సాహకాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
సరకు రవాణా కోసం కృష్ణా, గోదావరి జలమార్గాల వినియోగానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. చిట్యాలలో లాజిస్టిక్ పార్క్, నిజామాబాద్‌లో కంటైనర్ డిపో ఏర్పాటుతో పాటు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో లాజిస్టిక్స్ కోర్సులను ప్రారంభించడాన్ని కేంద్రం ప్రత్యేకంగా ప్రశంసించింది.
Comments
Loading comments...

