Back to feed
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకంపై తీర్మానం
Rohit Jun 16, 2026 7:03 AM హైదరాబాద్ 7 viewsabout 3 hours ago

హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులను తెలంగాణవారితోనే భర్తీ చేయాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ నియామకాల్లో స్థానిక మూలాలున్న వారికి ప్రాధాన్యతనిస్తూ, సామాజిక న్యాయ సూత్రాలను పాటించాలని తీర్మానించారు.
ఈ విషయమై ప్రభుత్వ పెద్దలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. నియామకాల్లో జరుగుతున్న అలసత్వానికి నిరసనగా, ఈ నెల 17న హైకోర్టులో ప్రత్యేక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి ప్రకటించారు.
Comments
Loading comments...



