వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఐదో విడతలో భాగంగా శనివారం 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు నిధులు అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
తాజా విడతలో 1.68 లక్షల మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.545 కోట్లు జమ చేసింది. దీంతో ఇప్పటివరకు రైతు భరోసా కింద మొత్తం 67.44 లక్షల మంది రైతులకు రూ.7,135.77 కోట్ల మేర ఆర్థిక సాయం అందినట్లయిందని మంత్రి వివరించారు.
Comments
Loading comments...

