Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూలిన వంతెన.. ఇబ్బందుల్లో ప్రయాణికులు

Follow Udayam on Google
దివ్య శ్రీ Jul 04, 2026 5:47 PM నిజామాబాద్General
కూలిన వంతెన.. ఇబ్బందుల్లో ప్రయాణికులు - Udayam
కామారెడ్డి జిల్లా గాంధారి-బాన్సువాడ రహదారిపై గొద్దెల వాగు వంతెన శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఓ వైపు కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఒకవైపు నుంచే వాహనాలు నడుస్తుండగా, మరింత వర్షం పడితే వంతెన పూర్తిగా ధ్వంసమయ్యే ప్రమాదముందని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...