Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ దళిత క్రైస్తవుల డిమాండ్

ధనుష్ రెడ్డి Jul 06, 2026 9:26 AM అల్ ఇండియా 10 viewsabout 1 hour ago
తెలంగాణ దళిత క్రైస్తవుల డిమాండ్ - Udayam Digital

Photo Gallery

తెలంగాణ దళిత క్రైస్తవుల డిమాండ్ - main
తెలంగాణ దళిత క్రైస్తవుల డిమాండ్ - gallery image
తెలంగాణలో దళిత క్రైస్తవులకు కేటాయించిన ఒక శాతం 'బీసీ-సీ' (BCC) రిజర్వేషన్లు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కావడం లేదని తెలంగాణ క్రైస్తవ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యుడు నథానియల్ ఆరోపించారు. ఈ వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అర్హులైన దళిత క్రైస్తవ కమ్యూనిటీలన్నింటికీ ఈ బీసీ-సీ రిజర్వేషన్ ఫలాలను పక్కాగా వర్తింపజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే ఈ లోపాలను సరిదిద్ది, సదరు రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...