Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నయాగరా 'బొగత' వద్ద పర్యాటకుల సందడి

ప్రణీత రెడ్డి Jul 12, 2026 2:10 PM ఆదిలాబాద్ 5 viewsabout 2 hours ago
తెలంగాణ నయాగరా 'బొగత' వద్ద పర్యాటకుల సందడి - Udayam Digital
ములుగు జిల్లా వాజేడు మండలంలోని ప్రసిద్ధ బొగత జలపాతం వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. 'తెలంగాణ నయాగరా'గా పిలవబడే ఈ జలపాతాన్ని సందర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇక్కడి ఈత కొలనులో కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి స్నానాలు చేస్తూ, సెల్ఫీలు దిగుతూ పర్యాటకులు సరదాగా కేరింతలు కొట్టారు.

Comments

G
Loading comments...