వార్తలకు తిరిగి వెళ్లండి
చిల్లర లేదని ‘మంత్రి’నే దిగిపొమ్మన్న కండక్టర్

కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ బెంగళూరులో ఆర్టీసీ బస్సుల్లో అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎవరూ గుర్తుపట్టకుండా మాస్క్ ధరించి సాధారణ ప్రయాణికుడిలా బస్సు ఎక్కిన ఆయన క్షేత్రస్థాయిలో రవాణా సేవలను పరిశీలించారు. ఈ క్రమంలో రెండు టికెట్ల కోసం మంత్రి రూ.100 ఇవ్వగా చిల్లర లేదని, కుదిరితే బస్సు దిగిపోవాలని కండక్టర్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
అలాగే, మరో స్టాప్‌లో ప్రయాణికుడు చేయి చూపినా ఆపకుండా వెళ్లిన ఓ డ్రైవర్ తీరును కూడా మంత్రి గమనించారు. ప్రయాణికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు కండక్టర్, డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు
Comments
Loading comments...