వార్తలకు తిరిగి వెళ్లండి
మంచినీళ్లు అనుకొని యాసిడ్ తాగిన యువతి
యూపీలోని హాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. నగల దుకాణానికి వెళ్లిన యువతి దాహం వేసి నీళ్లు అడగ్గా.. పక్కనే ఉన్న మిఠాయి షాపు నుంచి బాలుడు ఓ సీల్డ్ బాటిల్ తెచ్చాడు. అందులో ఉన్నది మంచినీళ్లు అనుకుని తాగేయడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. ఆ బాటిల్‌లో ఉన్నది యాసిడ్ అని గుర్తించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఆ సీల్డ్ బాటిల్‌లో యాసిడ్ ఎలా వచ్చిందో తెలియదని అదుపులో ఉన్న మిఠాయి షాపు యజమాని చెబుతున్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Comments
Loading comments...