వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ అపాయింట్‌మెంట్ అడగకుండానే, కలవకుండా చేస్తున్నారంటూ రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలో విభజన రాజకీయాలు చేస్తోందని, హిట్లర్ మనస్తత్వంతో హైడ్రాను తీసుకువచ్చిందని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరాన్ని ఏటీఎంగా మార్చుకుంటే, రేవంత్‌రెడ్డి మూసీ ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకోవాలని చూస్తున్నారని రామచందర్‌రావు ధ్వజమెత్తారు.
Comments
Loading comments...

