వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో తన ఉనికిని మరింత బలోపేతం చేస్తూ బంధన్ బ్యాంక్ ఒకేసారి మూడు కొత్త శాఖలను ప్రారంభించింది. వీటిలో రెండు హైదరాబాద్‌లో, ఒకటి మిర్యాలగూడలో నెలకొల్పారు. ఈ విస్తరణతో తెలంగాణలో మొత్తం శాఖల సంఖ్య 162కి చేరుకుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో వ్యూహాత్మక విస్తరణలో భాగంగా తమిళనాడులో ఐదు, కేరళ మరియు కర్ణాటకల్లో చెరో రెండు శాఖలను ప్రారంభించినట్లు బ్యాంక్ ఎండీ పార్థ ప్రతీమ్ సేన్‌గుప్తా తెలిపారు. ఖాతాదారులకు మరింత చేరువ కావడమే ఈ విస్తరణ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

