వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారికి వెళ్లే టేకుమట్ల వద్ద అండర్‌పాస్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన మలుపు వద్ద పనులు పూర్తికాకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రద్దీ సమయంలో సమస్య మరింత తీవ్రంగా మారుతోంది. వాహనదారులు గుత్తేదారు పనులను వేగవంతం చేసి అండర్‌పాస్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

