వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేటు, ఎయిడెడ్, ZP పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పడంతో 150 మందికి పైగా మోసపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. విజయవాడ కలెక్టరేట్‌లోని PGRSకు సోమవారం సుమారు 20 మంది బాధితులు వచ్చారు.
రిటైర్డ్ ఉద్యోగి విజయకుమారి, ఆమె భర్త ఒక్కొక్కరి నుంచి రూ.3-4 లక్షలు వసూలు చేసి ఉద్యోగాలు ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. కంచికచర్ల, మాచవరం తదితర ప్రాంతాల్లో కేసులు నమోదైనట్లు తెలిపారు.
Comments
Loading comments...

