Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ గుండెపోటుతో టీచర్ మృతి

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 12, 2026 7:24 PM హైదరాబాద్General
అనంతగిరిలో ట్రెక్కింగ్ చేస్తూ గుండెపోటుతో టీచర్ మృతి - Udayam
వికారాబాద్ జిల్లా అనంతగిరి అటవీ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ప్రియ (47) అనే మహిళ అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తీవ్రమైన గుండెపోటు వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. వృత్తిరీత్యా టీచర్‌గా పనిచేస్తున్న ప్రియ హఠాన్మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...