వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా స్టీల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2026-27)లో రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది. ఇందులో 60% నిధులను దేశీయ వ్యాపార విస్తరణకే వినియోగించనున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది.
ప్రస్తుతం 36 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న టాటా స్టీల్, దీనిని దీర్ఘకాలంలో 50 మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మనదేశంలో అదనంగా 12 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని పెంచనుంది.
Comments
Loading comments...

